భీమారం మండలంలోని జడ్పీహెచ్ఎస్ భీమారం హైస్కూల్లో జరుగుతున్న ఫ్లిన్నాట్/ఎన్ఐఓఎస్ ఉల్లాస్ పరీక్షా కేంద్రాన్ని మండల విద్యాధికారి (MEO) భీమారం శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (APM) భీమారం శ్రీనివాస్ గౌడ్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (CRP) సాగర్ సోమవారం పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను, విద్యార్థుల హాజరు శాతాన్ని అధికారులు సమీక్షించారు. ఇన్విజిలేటర్లు రవీంద్ర చారి, అరుణ, దేవిక, సెంటర్ కోఆర్డినేటర్ (CC) రాజ్యలక్ష్మి పరీక్షల పర్యవేక్షణలో పాల్గొన్నారు.
మొత్తం 45 మంది వయోజన విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 35 మంది మాత్రమే పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. మిగిలినవారు గైర్హాజరయ్యారు.
పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత సిబ్బందికి అధికారులు సూచనలు చేశారు. ఈ పరీక్షలు వయోజనులకు విద్యను అందించడంలో భాగంగా నిర్వహిస్తున్నారు.











