Andaman and Nicobar Islands, 2026-11-23
భీమారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సర్పంచ్ ఉస్కామల్ల విజయలక్ష్మి పున్నం చంద్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా అందిస్తామని, అర్హులైన వారందరూ నమోదు చేసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
భీమారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సర్పంచ్ ఉస్కామల్ల విజయలక్ష్మి పున్నం చంద్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ వీణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోడేటి రవి, ఎంపీవో సతీష్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలో హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. భీమారం గ్రామంలోని ప్రతి కుటుంబం ఇందిరమ్మ జీవిత బీమా 5 లక్షల పథకంలో అందరూ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆసరా పింఛన్ పథకం కింద భీమారం గ్రామ పంచాయతీకి 105 మందికి మంత్రి గారి ఆధ్వర్యంలో ప్రొసీడింగ్స్ అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్ సుధాకర్, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ గౌడ్, హౌసింగ్ ఏఈ రుచిత, గ్రామ సెక్రటరీ మల్లేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ప్రకాష్, సత్తి రెడ్డి, ఉపసర్పంచ్ సత్తమ్మ, కిష్టయ్య, వార్డ్ మెంబెర్స్, ప్రెసిడెంట్ రేవంత్ పటేల్, భీమారం గ్రామపంచాయతీ వార్డ్ మెంబెర్స్, గ్రామ ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

