అక్షరవేకువ (అక్షరవేకువ) జూన్ 30
భీమారం మండల కేంద్రంలోని SBI శాఖలో PMJJBY ఇన్సూరెన్స్ ద్వారా 2 లక్షల చెక్‌ను అందజేశారు. కేశయ్య మరణానికి సంబంధించిన నామినీగా ఉన్న మధును కు చెక్ అందించారు.
భీమారం మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - భీమారం శాఖలో ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన పథకం ద్వారా 436 రూపాయలతో ఇన్సూరెన్స్‌లో పేరు నమోదు చేసుకున్న బైరనేని కేశయ్య, అనారోగ్యంతో మరణించగా, నామిని గా ఉన్న అతని భార్య బైరేనేని మధును కు రెండు లక్షల రూపాయల చెక్‌ను ఎస్ బి ఐ - భీమారం శాఖ కార్యనిర్వహణ అధికారి జి. సుబ్బా రెడ్డి, క్షేత్ర పర్యవేక్షణ అధికారి వి. రామచంద్రుతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరు PMSBY, PMJJBY ఇన్సూరెన్స్‌లు తప్పకుండా చేసుకోవాలని, అపత్కాలంలో వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది డి. మనోజ్ కుమార్, బి. శంకర్, కె. సతీష్ కుమార్, ఆర్. గణ కామేష్ ఖాతాదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











