చొప్పదండికి చెందిన హనుమాన్ సాయి భజన మండలి కళాకారులు తమ మధుర గీతాలతో భక్తి సంగీత రంగంలో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత పిట్టల నారాయణ స్ఫూర్తితో వీరు ఆలయాల్లో భక్తి గీతాలతో పాటు జీవిత సత్యాలను తెలిపే గేయాలను ఆలపిస్తూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నారు.
ఈ బృందం టీటీడీ గోవిందుడి సన్నిధిలో కూడా తమ గానామృతంతో అలరించింది. మరణానంతర జీవిత సత్యాలను తెలిపే పాటలను కూడా ఆలపిస్తూ, మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చేలా ప్రార్థనలు చేస్తున్నారు.
హనుమాన్ సాయి భజన మండలిలో పిట్టల నారాయణ, పిట్టల రఘు, మోహన్, దండే లింగన్న, పూదరి నారాయణ, పూదరి లక్ష్మయ్య, దూస రాము, మంచి కట్ల విట్టల్, గాజుల రాజు, చీకట్ల లచ్చయ్య సభ్యులుగా ఉన్నారు. వీరి సమష్టి కృషితో భక్తి సంగీతానికి కొత్త వన్నె తెస్తున్నారు.
వీరి కార్యక్రమాలు కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంలోనూ, భక్తి భావాన్ని, నైతిక విలువలను సమాజంలో పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి.











