సంగారెడ్డి, 2026-11-22
సంగారెడ్డి కొత్లాపూర్ చౌరస్తా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సీ) వద్ద పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
సంగారెడ్డి కొత్లాపూర్ చౌరస్తా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సీ) వద్ద పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితా దేవి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్ దశరథ రెడ్డి, 32వ వార్డు కౌన్సిలర్ నవీన్, లాడే బాలు, హరీష్, మాణిక్ రెడ్డి, మాధవరెడ్డి, అశోక్, దామోదర్, మధు తదితరులు పాల్గొన్నారు.







