సంగారెడ్డి, 2026-08-12
ఈ నెల 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, బహిరంగ సభ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌజ్ లో పోలీస్ అధికారులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. సీఎం సభకు జనసమీకరణ, వాహనాల పార్కింగ్, ఇతర భద్రతాపరమైన అంశాలపై ఈ సమీక్ష సాగింది.
ఈ నెల 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, సభ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌజ్ లో పోలీస్ అధికారులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. సీఎం సభకు జనసమీకరణ, వాహనాల పార్కింగ్, ఇతర భద్రతాపరమైన అంశాలపై ఈ సమీక్ష సాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఐఐటీలోని హెలిప్యాడ్ నుండి నేరుగా ఐబీ చౌరస్తా వద్దకు చేరుకుంటారని తెలిపారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీల విగ్రహాలను సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఉమ్మడి జిల్లా నుండి వచ్చే లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల వాహనాల కోసం గంజి మైదాన్, మెడికల్ కాలేజీ ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, ఎమ్మెల్యేలు, మంత్రుల వాహనాలను డీఈవో కార్యాలయం వద్ద పార్కింగ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సంగారెడ్డి నియోజకవర్గం నుండే సుమారు నలభై నుండి యాభై వేల మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. అధికారులు సుమారు ఇరవై వేల మంది లబ్ధిదారులను తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం నుండి ఐదువేల మందిని, ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి కలుపుకుని మొత్తం లక్షమందిని సభకు తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జగ్గారెడ్డి, సంజీవ రెడ్డిలు తెలిపారు.
ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులు రఘుగౌడ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.










