దండేపల్లి, 7 September
శ్రావణ సోమవారం సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి అభిషేకాలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రావణ సోమవారం సందర్భంగా మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు శ్రావణ సోమవారం సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి అభిషేకాలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసంలో సోమవారానికి విశేష ప్రాధాన్యత ఉండటంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ అర్చకులు భక్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.












