జైపూర్, 2026-07-31
జైపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎం. పి. డి) గుర్రం సత్యనారాయణ పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం శుక్రవారం దుబ్బపల్లి గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
జైపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎం. పి. డి) గుర్రం సత్యనారాయణ పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. మండల పరిధిలోని వెంకట్రావుపల్లి పంచాయతీ, దుబ్బపల్లి గ్రామంలో గల PLNR ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా, మండల స్థాయి అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సత్యనారాయణతో తమకున్న అనుబంధాన్ని, పని చేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా మండల అభివృద్ధికి ఆయన అందించిన నిరంతర సేవలను, నిబద్ధతను కొనియాడారు. అనంతరం, ఆయన శేష జీవితాన్ని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గుర్రం సత్యనారాయణ - ప్రసన్నారాణి దంపతులను అధికారులు, నాయకులు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. వారి సేవలకు గుర్తుగా జ్ఞాపికలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, డిప్యూటీ సీఈఓ, సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ భూమేష్, తహశీల్దార్ వనజా రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందుపట్ల పాపి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీఓలు, జైపూర్ మండల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, EGS సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












