జైపూర్ లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన పాలకవర్గానికి స్థానిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం చేపట్టారు.
మంగళవారం వైద్యాధికారి ముస్తఫా మెడికల్ సిబ్బందితో కలిసి సర్పంచ్ కూన భాస్కర్ తో పాటు ఉపసర్పంచ్ ఇరిగిరాల శ్రవణ్ ను శాలువాలు కప్పి పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ ముస్తఫా మాట్లాడుతూ గ్రామీణ ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని వారిని కోరారు.
గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి సరఫరా, వ్యక్తిగత పరిశుభ్రతను ప్రోత్సహించాలని కోరారు.
అనంతరం ఆరోగ్య సమస్యల నివారణకు వైద్యశాఖ, పంచాయతీ సిబ్బంది కలిసి పని చేయాలని నిర్ణయించారు.





