ప్రపంచ పర్యావరణ దినోత్సవం (2026) సందర్భంగా జైపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో "స్వచ్ఛ గావ్ సురక్షిత జల్వాయు" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గ్రామ ప్రజలకు వివరించారు.
మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అధికారులు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, పచ్చదనాన్ని పెంచడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని, వాతావరణ సమతుల్యతను సాధించవచ్చని వివరించారు.
కార్యక్రమంలో భాగంగా, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామని "స్వచ్ఛ ప్రతిజ్ఞ" చేశారు. అనంతరం పర్యావరణ చైతన్యంపై గ్రామంలో "పర్యావరణాన్ని రక్షిద్దాం - జీవకోటిని కాపాడుకుందాం" అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) జి.సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) శ్రీపతి బాపు రావు, జైపూర్ సర్పంచ్ కూన భాస్కర్, ఉపసర్పంచ్ ఇరిగిరాల శ్రావణ్, ఏపీఓ బి.బాలయ్య, పంచాయతీ కార్యదర్శి బి.ఉదయ్ కుమార్, గ్రామపంచాయతీ సిబ్బంది, మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.








