అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 21
ైతరువాయి సింగిలక్సెట్ పేటలో కేటీఆర్ ఉద్ఘాటన్ డిజిట్ కేటీఆర్ పరిమితం మూడు రంగులక్సెట్ పార్టీ లక్సెట్ులక్సెట్ు మతరువాయిమే ుడ, అనని వలక్సెట్ు హస్తరువాయి పాలక్సెట్నకు రోజులక్సెట్ు దగ్గరపడ్డాయి ప్రజలక్సెట్ తరువాయిిరుగుబాటే తరువాయిమీలక్సెట్ిచచి పభుతరువాయివ మో చేతరువాయిోదని బీఆఎ నయులక్సెట్ు ేటీఆ ఆోపిచు. యువతరువాయిు యువతరువాయి డిజిట్లక్సెట్ేషన పేిట చేిన మోనని యువమ దు దవ ఎడటటమని తరువాయిలక్సెట్ిపు. ఈ దులక్సెట్ో పలక్సెట్ొనన యువతరువాయి పభుతరువాయివనని, ముఖయ ేవతరువాయి డడిజిట్ని తరువాయిీవ విమశిచిదని, యువతరువాయి చేతరువాయిిి ేవతరువాయి డడిజిట్ దొిితరువాయిే పొటటు పొటటు ొటటేలక్సెట్ ఉననని ేటీఆ వయఖయనిచు.
రైతులకు మాత్రమే కాకుండా, అన్ని వర్గాలకు హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఆరోపించారు. యువతకు యువత డిక్లరేషన్ పేరిట చేసిన మోసాన్ని యువసంగ్రామ సదస్సు ద్వారా ఎండగట్టామని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న యువత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించిందని, యువత చేతికి రేవంత్ రెడ్డి దొరికితే పొట్టు పొట్టు కొట్టేలా ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మళ్లీ రైతు ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ నాయకులను తరమాలని, అప్పుడే కేసీఆర్ ఆధ్వర్యంలో రైతు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణ యువత, రైతన్నలు కలిసి కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ నాయకులు బయటకు కూడా రాలేరని హెచ్చరించారు. ఇప్పటికే 31 నెలలు అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వం, మిగిలిన 29 నెలల్లో ఏం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ సినిమా ఇప్పటికే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని ఎద్దేవా చేశారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మంచి పనులు చేయాలని సూచించారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ నేతలను, ప్రజలను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంచిర్యాలలో పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి పేరు రాసి పెట్టుకుంటామని, అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను, అధికారులను వేధించిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు ప్రజల కోసం పని చేయాలని, కాంగ్రెస్ కోసం కాదని సూచించారు. ఈ రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వేల మంది యువత పార్లమెంట్ వద్ద నిలబడి కేంద్రాన్ని గడగడలాడించినట్లు, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే పరిస్థితి ఎదురవుతుందని కేటీఆర్ అన్నారు. యువత ఆకాంక్షలను పట్టించుకోకుంటే తెలంగాణ ఉద్యమ కాలంలో మాదిరి ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని, కాంగ్రెస్, బీజేపీలను తన్ని తరిమివేస్తుందని అన్నారు. ఉడుకు నెత్తురుతో యువత కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని, యువత, రైతన్నలు తిరగబడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా బయటికి తిరగలేరని గుర్తుంచుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు అల్లాడుతున్నారని, ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ ఆరోపించారు. రైతు కుటుంబాలకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ 8 గంటల పాటు ధర్నా చేసినా ప్రభుత్వం స్పందించలేదని, రెండున్నర నెలలు గడిచినా రైతు కుటుంబాలను ఆదుకునే సోయి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రాష్ట్రంలో కిరాతకమైన ప్రభుత్వం పాలిస్తోందని అన్నారు.










