మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 08
జషధశణజెైహజడై.ఈణైథ.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. శనివారం స్థానికంగా ఈ విషయంపై చర్చ జరుగుతోంది.
హాజరుపై ప్రశ్నలు
కీలకమైన మంచిర్యాల జిల్లా ప్రెస్ మీట్ కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు హాజరు కాకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర స్థాయి కీలక నేత వచ్చినప్పుడు ఆయన కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదని అంటున్నారు.
గ్రూపు రాజకీయాలు
బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 8న జరిగిన కన్వెన్షన్ హాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు హాజరు కాకపోవడం కూడా చర్చనీయాంశమైంది.











