మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 29
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్, బృందావన కాలనీలో మూడు కొత్త స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేశారు. శ్రీరామ్ రెడ్డి ఇంటి లైన్ లో ఏర్పాటు చేసిన ఈ లైట్లు స్థానికులకు సౌకర్యంగా మారనున్నాయి.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్, బృందావన కాలనీ రోడ్ నెం. 3, శ్రీరామ్ రెడ్డి ఇంటి లైన్ లో మూడు కొత్త స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ లైట్ల ఏర్పాటుతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జట్ట శ్రీనివాస్, పోటు శ్రీరామ్ రెడ్డి, 39వ డివిజన్ కార్పొరేటర్ పూదరి సునీత ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని కార్పొరేటర్ పూదరి సునీత ప్రభాకర్ ఈ సందర్భంగా తెలిపారు.










