దండేపల్లి, 2026-09-14
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజుగూడలో ఆదివాసీల చిరకాల స్వప్నం నెరవేరింది. కుంటలగూడ కట్ట వద్ద పోచమ్మ ఆలయం, ఆదివాసీ నాయికపోడ్ కమ్యూనిటీ హాల్‌ను తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ కొట్నాక తిరుపతి గారు సోమవారం ప్రారంభించారు. 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత నిర్మించిన ఈ హాల్‌ను దాతల సహకారంతో ఏర్పాటు చేశారు.
పోచమ్మ ఆలయ మరియు నాయకపోడ్ కమ్యూనిటీ హాల్ ప్రారంభం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజుగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కుంటలగూడ కట్ట వద్ద కుంటలగూడ కట్ట,తట్రాగూడ మరియు జైతు గూడ (నాయకపుగూడ) గ్రామస్తుల ఆరాద్య దైవం పోచమ్మ కు ఆలయాన్ని మరియు గ్రామస్తులు సమావేశం కావటానికి *ఆదివాసీ నాయికపోడ్ పోచమ్మ కమ్యూనిటీ హాల్ 20 సంవత్సరాల ఆదివాసిల కలను నెరవెర్చి నిర్మించి ఇచ్చిన దాతలతో కలసి తెలంగాణ రాష్ట్ర GCC ఛైర్మన్ కొట్నాక తిరుపతి గారు ఈ రోజు 14-09-2026 సోమవారం రోజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆలయ మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణ దాతలు కంది సతీష్ కుమార్ మహ్మద్ ముస్తఫా,ఆలయ స్థల విషయమ్లో సహకారమంధిచిన సందెల శ్రీధర్ ల ను గ్రామస్తులు, ప్రముఖులు శాలువాలతో సన్మానించారు ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కంది సతీష్ మాట్లాడుచు గుడి స్థల విషయములో నేలకొన్న సమస్యపరిష్కారములో సహరించిన ఎమ్మెల్యే శ్రీ. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి ప్రత్యేక దాన్యవాదాలు తెలిపినారు. ఇలాగే ఆదివాసిలంతా ఇకమత్యం తో ఉంటే ఏదైన సాదించవచ్చనీ కుంటిలగూడ కట్టా వాసులు నిరూపించారని అన్నారు. ఇకపై మరిన్నీ కార్య క్రమాలు చేసి ఆదివాసిల అభ్యున్నతి కృషి చేస్తామన్నారు. GCC చైర్మన్ కొట్నాక తిరుపతి గారు మాట్లాడుచూ ఆదివాసీలు,యువకులు పెద్ద చడువులు చదవుకొని ఉన్నత షిఖరాలు అధిరోహించాలన్నారు. ఆదివాసిల అభ్యున్నతి కృషి చేస్తున్న స్థానిక మాజి ఎంపీటీసీ హేమలత- సతీష్, సీనియర్ రిపోర్టర్ ముస్తఫాల సేవలను పలువురు వఖ్తలు కొనియాడారు. ఈ కార్యక్రమం లో GCC చైర్మన్ తో పాటు రాజుగూడ సర్పంచ్ మారినేని రాజవ్వ భీమయ్య, PACS డైరెక్టర్ కాంతారావు, మాజీ సర్పంచ్ లు లింగారావు, దుబ్బరాజం,మాజీ ఉప సుర్పంచ్ రాజన్న, కన్నక జంగు,అడై శంకర్,సాదిక్,నజీర్,రవీందర్ కుల పెద్దలు, స్టానిక నాయకుల సాదం రాజేశ్వరి బాపు, శ్రీనివాస్,ఎర్రయ్య,భీమయ్య,లచ్చన్న,కుంటి భీమయ్య,పుడారి శ్రీను తదితరులు పాలగొన్నారు.












