మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 15
ఇయెొైటీమచయజెండాశఖఆధయ80ఆయృధశమహచ.ఈభశపఅమీ,జెండాళపచ,ృధమఠయపపణీచశ.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్రం సిద్ధించుటలో అమరులైన మహనీయులను, వీర జవాన్లను స్మరించుకొని వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వృద్ధులకు మిఠాయిలను పంపిణీ చేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చందూరి మహేందర్, కోశాధికారి కే. సత్యపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎడ్ల కిషన్, శంకర్ వర్మ పాల్గొన్నారు. అలాగే రక్త నిధి సూపర్వైజర్ . మాధవి, సిబ్బంది, ఆశ్రమ నిర్వాహకులు సదానందం, తిరుమల, వృద్ధులు, పిల్లలు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.









