తెలంగాణ కాంగ్రెస్ మైనార్టీ విభాగం, మంచిర్యాల జిల్లాలో అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ మరియు జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాలిద్ ఈ ప్రకటన చేశారు. జిల్లా కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ మైనార్టీ విభాగం అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.
అసక్తి గల మైనార్టీ నాయకులు దరఖాస్తు చేసుకోవాలని ఖాలిద్ తెలిపారు. ఈ కార్యక్రమం ఆదివారం రోజున ఎం ఎం గార్డెన్ సీసీసీ నస్పూర్ వద్ద జరుగుతుంది.
ముఖ్య అతిథులుగా జిల్లా పరిశీలకులు ఎం ఏ లతీఫ్ మరియు ఇతరులు పాల్గొంటున్నారు. ఆసక్తి ఉన్నవారు 9177999097 నంబరును సంప్రదించవచ్చు.









