అక్షరవేకువ (అక్షరవేకువ) అక్టోబర్ 09
మంచిర్యాలకు యాలకపొషనకౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలకు వేదికగా మారడం
మంచిర్యాల కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలకు వేదికగా మారడంతో మంచిర్యాల ప్రతిష్టకు మచ్చ తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మూడు నెలలకు ఒకసారి జరిగే ఈ సమావేశంలో 57 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే, ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి, కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతిని బలనిరూపణ చేసుకునేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలోనే కొందరు మహిళా కార్పొరేటర్లు మైకులు లాక్కోవడం, అరుపులు, కేకలు వేయడం, మేయర్ పోడియంను ముట్టడించడం, మేయర్‌పై ఏకవాక్య సంబోధనతో దూషణలకు దిగడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆరోపణలు, విమర్శలు, ప్రతివిమర్శల మధ్య కౌన్సిల్ సమావేశం గరం గరంగా సాగింది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఉన్న రాజకీయ వివాదానికి కౌన్సిల్ మందిరం వేదికగా మారిందని పలువురు ఖండించారు.
డివిజన్లలో అనేక సమస్యలు, తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు, దసరా ఏర్పాట్లు వంటివి కార్పొరేటర్ల ముందు ఉన్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి ఆదిపత్య రాజకీయ పోరుకు తెరలేపడం, నువ్వా నేనా అన్నట్లు వ్యవహరించడంపై పలువురు అవాక్కు అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడే ఇలా ఉంటే, ఇంక ముందర ఎలా అన్న ప్రశ్న సైతం ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది.











