మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 29
ససఐఅససఅశౌఫౌ3ైఆశ57సశహఉఆళససఇహైైఎఅశఒసఆళ.57ణహైహససూశ.ఫౌసశశ.
సోమవారం జరిగిన మంచిర్యాల కార్పొరేషన్ మీటింగ్‌లో 57వ డివిజన్లో తెలంగాణ తల్లి విగ్రహం ముందర లారీల రాకపోకలపై రహదారి ప్రతిపాదనను కార్పొరేటర్ చేయగా, దాన్ని మార్చి మరోచోట పెట్టినందుకు వాడివేడి చర్చ జరిగింది. ఈ విషయంలో బీజేపీ కార్పొరేటర్లు మేయర్ మధుకర్‌తో వాగ్వాదానికి దిగారు.
రోడ్డు ప్రతిపాదించిన చోటు కాకుండా మరోచోట డైవర్షన్ పెట్టడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎజెండా అంశాలను ఒక్కొక్కటిగా చర్చించాలని డిమాండ్ చేశారు. మేయర్ నోటీస్ ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీంతో బీజేపీ ఫ్లోర్ లీడర్ ముకేష్ గౌడ్ మీటింగ్‌ను బాయ్‌కాట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో 57 డివిజన్లో రాజకీయం రగిలింది. సమావేశం హాల్ ముందు ఉద్రిక్తత నెలకొంది.
బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ ఆందోళన చేపట్టారు. బీజేపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించిన మేయర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బీజేపీ నేతలను సీఐ ప్రమోదరావు అరెస్టు చేశారు.










