మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 15
జిల్లాకేడిలోని భూతపూర్వకాసుపత్తిలో ఇంజనీర్స్ డే సందర్భంగా రక్తదాన శిబిరంలో భాగం పడుతూ మహానుభావులు సేవలు చేసినరు. భాతనసోక్షుడి శేషంలో జన్మదినోత్సవంను పూర్తిగా పూజించుకొన్నరు.
సెప్టెంబర్ 15ఇంజనీర్స్ డే సందర్భంగా జిల్లా ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెంట స్నేహధర్, కార్యదర్శి అందుకుల విక్రం, కోశాధికారి వినీల్ మోటూరి, జాయింట్ సెక్రటరీ పెంటమ్ వంశీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్ వేల్పుల, మరియు వారి కార్యవర్గ సభ్యులు 15 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తదనంతరం, లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే సందర్భంగా వారికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, లైన్స్ క్లబ్ ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా, కార్యక్రమ చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ పురోగతిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, కార్యదర్శి లయన్ తౌటమ్ శ్రీనివాస్, ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, రక్త నిధి సిబ్బంది లావణ్య, రజిత, శిరీష, మణికంఠ మరియు రక్తదాతలు పాల్గొన్నారు.












