మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 14
జిల్లా పెరక సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రూ. 20 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల మంజూరు పట్ల సంఘం నాయకులు ఎమ్మెల్యేకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంఘం నాయకులు ఆయనను శాలువాతో సన్మానించి, కృతజ్ఞతలు తెలియజేశారు.
జిల్లా పెరక సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రూ. 20 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎమ్మెల్యేకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సంఘం నాయకులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును శాలువాతో సన్మానించి, తమ కృతజ్ఞతలు తెలియజేశారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, జిల్లా పెరక సంఘం అధ్యక్షులు బొడ్డు శంకర్, పెరక ట్రస్ట్ బి.ఆర్. లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు బొడ్డు తిరుపతి, డాక్టర్లు బొడ్డు రఘునందన్, ముత్తినేని అనిల్ కుమార్, పెరక జిల్లా నాయకులు మానయ్య, చుంచు సదానందం, గూడ గోపి, కార్పొరేషన్ సభ్యులు పాల్గొన్నారు.


