లక్సటిపేట, దండేపల్లి, రాజీవ్ నగర్, హైటెక్ సిటీ, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 09
మంచిర్యాల జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే పిఎసార్పై బీఆర్ఎస్, బీజేపీ, జగన్ వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. పలువురు నాయకులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు జగన్ వర్గంలోకి చేరడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.
ఎమ్మెల్యే పిఎసార్ కు త్రిచక్ర బంధనం చుట్టుముట్టినట్లు కనిపిస్తుంది. పక్కలో బల్లెంల జగన్ వర్గం మంత్రి ఎంపీ బ్యాక్ బోన్ ముందుకు సాగుతూ 8 కార్పొరేటర్లు 2 మాజీ మున్సిపల్ చైర్మన్ 3 లక్సటిపేట కౌన్సిలర్లు దండేపల్లి లక్షెట్టిపేట సర్పంచ్ లు ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ జడ్పీటీసీలు తదితరులు జగన్ వర్గానికి చేరుతున్నారు. దీంతో పక్కలో బల్లెంల జగన్ చర్యలు సాగుతుంటే మరోపక్క బీ ఆర్ఎస్ బిజెపి ముప్పిట దాడి కొనసాగుతుంది తీవ్రస్థాయిలో మాటల దాడి సాగుతుంది. డిఫెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు కనిపిస్తుంది. మంచిర్యాలలో మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రజల్లో చర్చపో చర్చలు దారితీస్తుంది. ప్రధానంగా గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రాష్ట్ర నాయకులు విజిత్ రావు 22 ఏ నిషేధిత భూములపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు. గత 9 నెలలుగా గమ్మునుండి ఇప్పుడు ఎమ్మెల్యే గజం భూమి పైన రాజీనామా చేస్తానడు పై తీవ్రస్థాయి గులాబీ నేతలు మండిపడుతున్నారు. అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయిలో ఆరోపణ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోపక్క బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు గంజాయి బ్యాచ్ వసూళ్లు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాటిపై స్పష్టత కోరుతూ బిజెపి ఛార్జ్ సీట్ విడుదల చేసి 30 రోజుల్లో అమ్మ డంపింగ్ యార్డ్ తరలింపు 90 రోజుల్లో ఎల్లంపల్లి భూనిర్వాసితుల నష్టపరిహార చెల్లింపులు 120 రోజుల్లో రాజీవ్ నగర్ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ నిర్మాణం 160 కోట్లతో గోదావరి 40 కిలోమీటర్ల వ్యత్యాసం అంతర్గామా బ్రిడ్జి నిర్మాణం, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి రైతులకు సాగునీటి కష్టాలు కార్పొరేషన్ లో తాగునీటి ఇక్కట్లపై బహిరంగ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా మంచిర్యాలలో రాజకీయ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది మూడు వర్గాలు ఎమ్మెల్యే పై ముప్పేట దాడి చేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం డిఫెన్స్ పాత్ర పోషించడం కోసమేరుపుగా కనిపిస్తుంది.












