మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో కాంగ్రెస్ నాయకుడు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో స్వర్గీయ కాక వెంకటస్వామి, కళావతమ్మ గారి పేర్లతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా, రెండు నెలలు పూర్తయిన సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు.
ప్రతిరోజూ మంచినీటి పంపిణీ, వారానికోసారి మజ్జిగ, పెరుగు అన్నం పంపిణీ వంటి కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలు రెండు నెలలు పూర్తి చేసుకోవడం పట్ల బండి సదానందం యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు.
స్వర్గీయ కాక వెంకటస్వామి, కళావతమ్మ గారి సేవా స్ఫూర్తితో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించడం తమ లక్ష్యమని, సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆయన అన్నారు.
జూన్ నెలాఖరు వరకు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని, పేదలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశమని, ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సదానందం యాదవ్ హామీ ఇచ్చారు.
మందమర్రి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.











