మందమర్రి బ్లాక్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా బెల్లంకొండ కర్ణసాగర్ రావు, మున్సిపాలిటీ ఇన్చార్జిగా గోపతి బానేష్ లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకాలను పురస్కరించుకొని స్థానిక నాయకులు నూతన బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
డిసిసి వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ కర్ణసాగర్ రావును మందమర్రి బ్లాక్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా, డిసిసి సెక్రెటరీ గోపతి బానేష్ లను మందమర్రి మున్సిపాలిటీ ఇన్చార్జిగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కర్ణసాగర్ రావు, బానేష్ లను మందమర్రి పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ జనరల్ సెక్రటరీ సొతుకు సుదర్శన్, మండల అధ్యక్షులు కడారి జీవన్ కుమార్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు శాలువాతో సన్మానించి, మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నూతన ఇంచార్జులు కృషి చేయాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ నియామకాలు స్థానిక కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని, పార్టీ కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.








