ఐ ఎన్ టి యు సి మందమర్రి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలు పాత బస్టాండ్ సమీపంలో జరిగింది. ముఖ్యఅతిథిగా రాంశెట్టి నరేందర్ విచ్చేసారు.
నరేందర్, 1886లో చికాగోలో జరిగిన ఉద్యమ ఫలితంగా మేడే ఆవిష్కరణ జరిగిందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండల చైర్మన్ శ్రీ బి జనక్ ప్రసాద్, అసంఘటితరంగా ఉన్న కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు మరియు అనేక కార్మికులు పాల్గొన్నారు.








