తెలంగాణ శాసనమండలి సభ్యులుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మరియు ఎమ్మెల్సీ హాజరుద్దీన్లను తెలంగాణ రాష్ట్ర గొర్రెల-మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో, డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమ సారథిగా, విద్యావేత్తగా రాష్ట్రానికి ఎనలేని సేవలందించారని ప్రశంసించారు. ఎమ్మెల్సీ హాజరుద్దీన్ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఉందని, ఇకపై మైనారిటీ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు. ఇలాంటి మహనీయులు శాసనమండలికి ఎన్నిక కావడం తెలంగాణ ప్రజలకు దక్కిన అదృష్టమని ఆయన అభివర్ణించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా, ఇరువురు ఎమ్మెల్సీలకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. శాసనమండలిలో ప్రజా సమస్యలపై గళం విప్పి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వీరు పాటుపడతారని ఆశిస్తున్నట్లు డాక్టర్ అశోక్ యాదవ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిల్లారపు సంతోష్ యాదవ్, డాక్టర్ ఎం.కె. రాజేష్ (సోషల్ సర్వీస్), జెసి గాదెనవేని బుచ్చన్న యాదవ్, శ్రావణ్ కుమార్ మరియు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నూతన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.












