మంచేరియల్, 2026-11-21
మంచిర్యాల నియోజకవర్గ మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్లో మేయర్ ధర్ని మధుకర్సుజాత దంపతుల ఆధ్వర్యంలో, మరోవైపు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తూ, వారి సమస్యలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న సురేఖమ్మ సేవలను కార్మిక సంఘం ప్రతినిధులు కొనియాడారు. మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు సుధమల్ల హరికృష్ణ, రాచకొండ గోపాల్ రావు, ఖలీద్, కొండ్ర రాజేశ్వరిలింగయ్య, సంఘం అధ్యక్షుడు కొయ్యల వెంకటి, వర్కింగ్ ప్రెసిడెంట్ బుడిద శ్యామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కోకిల శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు గోపతి తిరుపతి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పిట్టల రవి, నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సురేఖమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.







