23 నవంబర్ 26 అక్షరవేకువ (అక్షరవేకువ) నవంబర్ 23
మంచిర్యాలలో రాజకీయ దుమారం రేపిన మంత్రి వివేక్ పరుగుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరంగల్లో జరిగిన సభలో కేటీఆర్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి.
వివరాల్లోకి వెళితే, భారత్ సమ్మిట్ సందర్భంగా గిగ్ వర్కర్ల స్కూటీ ర్యాలీ మంచిర్యాలలో సాగుతుండగా, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరుగులు తీస్తున్న దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతూ రాజకీయ చర్చకు దారితీశాయి.

