దండేపల్లి, 6 September
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండలం గుడ్డం గ్రామ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ చర్యలు చేపట్టింది. పార్టీ కార్యకర్తలు ఎంపీ వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేయడం, ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం వంటి ఆరోపణలపై ఆరుగురు కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనలో వివాదం... ఆరుగురు కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు మండలం Guddem గ్రామ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ చర్యలు చేపట్టింది. పార్టీ కార్యకర్తలు ఎంపీ వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేయడం, కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం వంటి ఆరోపణలపై ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా వ్యక్తిగతంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న వారు: ------------------------------- 1. గడ్డం త్రిమూర్తి – జిల్లా అధ్యక్షుడు, RGPRS 2. అక్కల వెంకటేశ్వర్లు – మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, 3. అంకతి శ్రీనివాస్ – RTA మెంబర్, మంచిర్యాల 4. ముత్యాల శ్రీనివాస్ – మాజీ MPTC 5. లక్కకుల సృజన్ 6. అకుల దుర్గ ప్రసాద్












