గుమ్మడిదల, 10 September
మండలం నల్లవల్లి గ్రామంలో కంది పంట క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పంట పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నారు. కంది సాగులో యాజమాన్య పద్ధతులు, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు.
గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో గురువారం కంది పంటను పటాన్చెరు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంట పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నారు. కంది సాగులో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, తెగుళ్ల నివారణ, ఎరువుల వినియోగం తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సూచనలు, సలహాలు పాటించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మనోహర్, ఏఈఓలు వందన, సుమిత, బీటీఎం స్పందన, ఏటీఎం సాయికిరణ్, రైతులు సురేష్, మధు తదితరులు పాల్గొన్నారు.












