భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కాసిపేట రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ సర్పంచ్ పెద్దల రూప బాపు, గ్రామ కార్యదర్శి క్రాంతి తేజ, 8వ వార్డ్ మెంబర్ నీలాల నరేందర్, అంబేద్కర్ ఆశయాలను ప్రజలు ఆచరించాలని సూచించారు.
నాయకులు నీలాల రాజమల్లు మాట్లాడుతూ, అంబేద్కర్ చూపిన సమానత్వ మార్గం సమాజానికి దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. వేడుకలు గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.












