నార్సింగి (అక్షరవేకువ) ఆగస్టు 15
నార్సింగిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌడ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం భవనం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గౌడ పృథ్వీరాజ్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు గౌడ పృథ్వీరాజ్ గౌడ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు గౌడ స్వామి గౌడ్, గౌడ సిద్దాగౌడ్, శంకర్ గౌడ్, ఉపేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, సత్యంగౌడ్, వెంకట్ గౌడ్, యాదగిరి గౌడ్, భరత్ గౌడ్‌తో పాటు పలువురు గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.