Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 08
హాజీపూర్ మండలం పెద్దంపేటలో మంగళవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు.
హాజీపూర్ మండలం పెద్దంపేటలో మంగళవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
(గో టు విలేజ్) కార్యక్రమం ద్వారా చదువు మానేసిన విద్యార్థులను గుర్తించి, వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించి, ఉన్నత విద్య వైపు ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా తీర్మానించారు.












