సంగారెడ్డి, 2026-11-21
సంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా.
సంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. కె. లలితా దేవి శనివారం జిల్లాలోని తెల్లాపూర్, బీరంగూడ, అమీన్పూర్ ప్రాంతాలలో ఉన్న పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా అని పరిశీలించడానికి ఈ తనిఖీలు నిర్వహించారు. కొన్ని ఆసుపత్రులలో గుర్తించిన లోపాలను డీఎం అండ్ హెచ్వో ఆసుపత్రి యాజమాన్యాల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే లోపాలను సరిదిద్దుకోవాలని, రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. లోపాలు గుర్తించిన ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా లోపాలు సరిదిద్దుకోకపోతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా డీఎం అండ్ హెచ్వో లలిత దేవి మాట్లాడుతూ, ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయకూడదని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. జిల్లాలో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.సౌజన్య, డా.రజని, శ్రీనివాస రావు, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







