మంచేరియల్, 15 August
తీవ్ర జ్వరంతో బాధపడుతూ ప్లేట్లెట్స్ 15,000కు పడిపోయిన 15 ఏళ్ల బాలిక ప్రాణాలను రక్తదాత అబ్దుల్ ముఖిత్ కాపాడారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న బాలిక కుటుంబ సభ్యులు రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ () ఫౌండర్ అబ్దుల్ రహీమ్ గారిని సంప్రదించారు.

తక్షణ స్పందనతో చిన్నారికి అండ
పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అబ్దుల్ రహీమ్, తన మిత్రుడు, రక్తదాత అబ్దుల్ ముఖిత్ గారికి సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌కు చేరుకుని, తన అమూల్యమైన ప్లేట్‌లెట్స్‌ను దానం చేసి బాలిక ప్రాణాలను నిలబెట్టారు.
అభినందనలు తెలిపిన కుటుంబ సభ్యులు
సమయానికి స్పందించి ప్రాణదాతగా నిలిచిన అబ్దుల్ ముఖిత్ గారికి బాలిక కుటుంబ సభ్యులు, వర్మ, రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ ఫౌండర్ అబ్దుల్ రహీమ్, మిత్రులు పాషా, మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రక్తదానంపై అవగాహన
ఈ సందర్భంగా అబ్దుల్ రహీమ్, అబ్దుల్ ముఖిత్ మాట్లాడుతూ, ప్రస్తుత సమయంలో జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడానికి యువత అంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రక్తదానం - ప్రాణదానం. సమయానికి ఇచ్చే రక్తం ఒక జీవితాన్ని నిలబెడుతుంది అని అన్నారు.