భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీసిసి కార్నర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ శ్రీమతి సళ్ళ రమ్య మహేష్ లు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను, ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలను, పేదల అభ్యున్నతికి చేపట్టిన పథకాలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











