నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ రామ్ కిషన్ రెడ్డి ఇటీవల మరణించిన పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సారంగాపూర్ మండలంలోని ప్యారమూరు గ్రామానికి చెందిన సుంకరి వసంత, బీరవెల్లి కాల్వ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ కిషన్ రెడ్డి గ్రామానికి వెళ్లి, మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే, వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన లగ్గం జగదీష్ దుబాయ్లో రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆయన కుటుంబ సభ్యులను కూడా రామ్ కిషన్ రెడ్డి పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం అందించి, అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఇదే గ్రామానికి చెందిన ఏరిండ్ల చిన్నయ్య, మర్రి లస్మవ్వ కుటుంబాలను కూడా ఆయన సందర్శించి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వారికి కూడా ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ పరామర్శ కార్యక్రమాలలో మండల కన్వీనర్లు దేవి శంకర్, కృష్ణారెడ్డి, మహేష్ రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, మోతేవార్ లక్ష్మణ్, ప్యారామూర్ రవి, లక్ష్మణ్, నరేష్, గంగయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.










