Mancherial/Jaipur (అక్షరవేకువ) జూలై 16
మచఉధైూమదఅతతై,ఘ.ఈద,మథతధ,,అమఆదదఎతతత.అబదహళచ,చ.
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జైపూర్ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.
పుట్టినరోజు వేడుకల ప్రారంభంలో భాగంగా రిక్కుల శ్రీనివాస్ రెడ్డి జైపూర్ కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పుష్పగుచ్ఛం, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అనంతరం అక్కడే ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో రిక్కుల శ్రీనివాస్ రెడ్డి చేత కేక్ కట్ చేయించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు ఆయనకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని శ్రీనివాస్ రెడ్డికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు అందజేశారు.
ఈ వేడుకల్లో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ట్రెసారర్ ముఖ్య శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ శీలం వెంకటేష్, జైపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, శ్రీనివాస్ రెడ్డి బృందం సభ్యులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నాయకులు, రిక్కుల శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ బర్త్ డే వేడుకలతో జైపూర్ పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.










