సంగారెడ్డి, 15 September
వినాయక చవితి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వినాయక మండపాల్లో ఏర్పాటు చేసిన తొలి రోజు పూజా కార్యక్రమాల్లో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తొలుత రామ్ నగర్‌లోని రామ్ మందిర్ వద్ద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
వినాయక చవితి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వినాయక మండపాల్లో ఏర్పాటు చేసిన తొలి రోజు పూజా కార్యక్రమాల్లో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తొలుత రామ్ నగర్‌లోని రామ్ మందిర్ వద్ద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జగ్గారెడ్డి స్వయంగా భజన చేస్తూ భక్తులతో కలిసి వీధుల గుండా ఊరేగింపుగా బ్రాహ్మణవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి మట్టి గణపతి విగ్రహాన్ని తీసుకువచ్చి రామ్ మందిర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రతిష్ఠించారు. అనంతరం వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి పర్యవేక్షణలో గంజి మైదాన్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి, అల్లుడు గుణ చైతన్య రెడ్డి తొలి పూజల్లో పాల్గొన్నారు. రామ్ మందిర్ యువసేన సభ్యుడు దత్తు ఆధ్వర్యంలో రామ్ మందిర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జరిగిన ప్రత్యేక పూజల్లోనూ జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంగారెడ్డి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ అధ్యక్షతన చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కూడా కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు కూన సంతోష్ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బైపాస్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తూర్పు భరత్ సాయి రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భరత్ సాయి రెడ్డి, ఆయన కాబోయే సతీమణి పాలక్ పటేల్ ఆధ్వర్యంలో తొలి రోజు పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి ప్రజలకు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.






