మందమర్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సారంగపల్లి గ్రామ సర్పంచ్ బచ్చలి రాములు, రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మందమర్రి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కడారి జీవన్ కుమార్ ఈ ఆహ్వాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా బచ్చలి రాములు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ చేరికతో స్థానిక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపు వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
సారంగపల్లి మాజీ సర్పంచులు కమల మనోహర్, ఆసంపల్లి రాజయ్య, చంద్రకళ, సంతోష్ రావు, తాజుద్దీన్, ముఖిద్, రాయ మల్లుతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్టీలో చేరిన అనంతరం సర్పంచ్ బచ్చలి రాములు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు.








