పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీజేపీ మాజీ ఎంపీ వెంకటేష్ నేత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ బీజేపీ నిధులతోనే పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందని, అయితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రజలను నమ్మించి మోసం చేసిందని బీజేపీ మాజీ ఎంపీ వెంకటేష్ నేత ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సింగరేణిలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, ఎంపీ వంశీ అవగాహన లేని పనులు చేస్తున్నారని విమర్శించారు. మంచిర్యాలలో కేరళ రైలును నిలిపివేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
మంచిర్యాల సింగరేణి అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలను ప్రస్తుతం ఉన్న 20 వేల నుంచి 25 వేలకు పెంచేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు త్వరలో హస్తం పార్టీపై తిరుగుబాటు చేస్తారని, మోడీ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతాయని, కేంద్ర ప్రభుత్వంతోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని వెంకటేష్ నేత అన్నారు.









