హజీపూర్, 2026-11-23
హాజీపూర్ మండలం బుగ్గట్టు గ్రామ రహదారిపై ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ ఎక్సెల్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పి ట్రాలీతో సహా బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు లేబర్ గాయపడ్డారు.
హాజీపూర్ మండలం బుగ్గట్టు గ్రామ రహదారిపై ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ ఎక్సెల్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పి ట్రాలీతో సహా బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు లేబర్ గాయపడ్డారు. ట్రాలీలో ఉన్న సిమెంట్ ఇటుకలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులకు సహాయం అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రి వివరాలు తెలియాల్సి ఉంది.


