సంగారెడ్డి, 2026-11-26
హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఈ నెల 23న నిర్వహించిన మయూరి ఆర్ట్స్ ఐకానిక్ హానరరీ అవార్డ్స్2026 కార్యక్రమంలో వికాస్ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ కు గురువారం ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రియాల్ గ్రామ సర్పంచ్ అనసూయ, రాజశేఖర్, గ్రామ పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కలిసి లక్ష్మణ్ ను శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి ప్రతిష్ఠాత్మక అవార్డు అందజేయడం తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించిందన్నారు. అవార్డు అందుకున్నందుకు ప్రజాప్రతినిధులు, యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు తనను ఆత్మీయంగా సన్మానించడం మరింత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో విద్యా రంగంలో మరిన్ని సేవలు అందిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. తనను అభినందించి సన్మానించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

