మంచేరియల్, 11 October
తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ప్రయాణం కానుంది. 33 జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు మూడు రోజులపాటు జరిగే కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఢిల్లీకి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం పయనం కానుంది. 33 జిల్లాల అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు మూడు రోజులపాటు జరిగే కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఢిల్లీ కేంద్రంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర పెద్దలు హస్తినాబాటకు సిద్ధమైంది. ఈ పర్యటన కోసం ఆదివారం ప్రత్యేక విమానంలో ఏర్పాట్లు చేశారు. ఈ మూడు రోజుల కార్యక్రమాలకు రాష్ట్రంలోని 33 జిల్లాల డిసీసీ అధ్యక్షులను ఆహ్వానించినట్లు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి తెలిపారు. సర్ ఓట్ల నమోదు ప్రక్రియలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడం, పార్టీని బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు . సోమవారం సర్ ఓట్ చోరీపై ఆందోళన నిరసన మంగళవారం పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, బుధవారం జిల్లా అధ్యక్షులతో ముఖాముఖి సమావేశం, మరికొన్ని కార్యక్రమాలు సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, రాబోయే ఎన్నికల్లో మరోసారి అధికార దిశగా పార్టీని నడిపించే కార్యాచరణపై దృష్టి సారించనున్నారు. ఈ సమావేశాలకు కేంద్ర అధ్యక్షులు ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.


