మర్కూక్
సిద్దిపేట జిల్లా మండలం ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో 45 ఎకరాల భూముల ఆచూకీ లభ్యం కానందున, వాటి గుర్తింపునకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. గత నెల శాసనసభలో జరిగిన చర్చలో ఈ భూములపై విచారణకు ఆదేశించిన నేపథ్యంలో, పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో 45 ఎకరాల భూముల ఆచూకీ లభ్యం కానందున, వాటి గుర్తింపునకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. గత నెల 16వ తేదీన శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ఈ భూములపై విచారణకు ఆదేశించారు. ఆ విచారణ పురోగతిపై ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోదీ పెవిలియన్లో సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, భూ అక్రమాలపై విచారణకు వేసిన కమిటీ, ధరణి అక్రమాలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచారణ పురోగతి వివరాలను కమిటీ సభ్యులు వివరించారు.
ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉందని, కానీ తాజా సర్వేలో 343 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు గుర్తించామని అధికారులు చెప్పారు. రికార్డులో ఉన్న భూమికి, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య 45 ఎకరాల వ్యత్యాసం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆ 45 ఎకరాల భూమిని తేల్చేందుకు ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వేకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సర్వే నంబర్ 325 సమీపంలోనే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, ఆయన కుటుంబ సభ్యులకు భూములు ఉన్నందున, వారి భూముల రికార్డులను సమర్పించాలని నోటీసులు జారీ చేస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
సర్వే నంబర్ 325లో గుర్తించే భూమిని స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీని నిర్మించాలని ఆదేశించారు.
అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో కాలనీని అభివృద్ధి చేయాలని సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలని, వచ్చే నెలలోగా తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కొండపాక మండలం వెలికట్ట గ్రామ పరిధిలో అసైన్డ్ భూములు, మిషన్ భగీరథ భూములు మినహా మిగిలిన భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ () తోపాటు ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఎల్నినో నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల నీటిని జాగ్రత్తగా వినియోగించాలని అధికారులకు సూచించారు. మల్లన్న సాగర్ నీటిని అనధికారికంగా వినియోగించే వారిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


