విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములై ఓటు హక్కును వినియోగించుకున్న నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నగర భవిష్యత్తు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.


