బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , నేరదిగొండ మండలాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
మండల కేంద్రానికి చెందిన పవార్ రవి నాయక్ నక్షత్ర ఆసుపత్రిలో శస్త్రచికిత్స పొందుతున్న ఆయనను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. అనంతరం నేరదిగొండ మండలం రాజురా గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని, మండలంలోని తోషం గ్రామానికి చెందిన కనీబాయిని కూడా ఆయన పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మాజీ మంత్రి జోగురామన్న, ముఖ్య నాయకులు తిరుమల్ గౌడ్, సంజీవ్ ముండే తదితరులు ఉన్నారు.












