మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన కుమారి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు ఈ నేపథ్యంలో, సోమవారం ఆయన కుటుంబ సభ్యులను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పరామర్శించారు వారి ఇంటికి వెళ్లి, మృతుని కుటుంబ సభ్యులను కలిసి, వారికి మనోధైర్యాన్ని కల్పించారు
కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అండగా తామున్నామని ఓదార్చారు. ఈ సందర్భంగా, కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ, ప్రజల కష్టాల్లో అండగా ఉండటం తమ బాధ్యత అని అన్నారు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందించారు వారి కుటుంబానికి ఈ తీరని లోటును భర్తీ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు












