సింగరేణికి రక్షణ కవచంగా బీజేపీ ఉంటుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటల గారడితో మోసం చేశాయని, రాష్ట్ర ప్రభుత్వం 55 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నస్పూర్ చౌరస్తాలో జరిగిన సింగరేణి బకాయిల లడాయి ధర్నా కార్యక్రమంలో ఆయన కార్మికుల పక్షాన గళం ఎత్తారు.
డిస్మిస్ పేరుతో 40 వేల మంది కార్మికులను తొలగిస్తే, సంఖ్య తగ్గితే పోరాటం చేస్తామని కమలం పార్టీ హెచ్చరించింది. ఔట్సోర్సింగ్ కార్మికులకు రోజుకు రూ.1250 చెల్లించాలని, రూ.600లను అంగీకరించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆసుపత్రులలో వసతులు, ఔషధాలు అందించాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
బోనస్, భూమిపై హామీలు
సింగరేణి లాభాలలో 40 దసరా బోనస్‌గా ఇవ్వాలని, కాంగ్రెస్ కార్మికులకు ఇంటి నిర్మాణం కోసం 2 గుంటల భూమి, నెలకు మూడు సార్లు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈటల రాజేందర్ అన్నారు. ఇబ్బందులు ఉన్న కార్మికులను అన్‌ఫిట్ చేయాలని, వారిని వేధించరాదని, సింగరేణి యాజమాన్యం వేధింపులను సహించబోమని ఆయన పేర్కొన్నారు.
ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.











