మండలం తాళ్లపేటలో బతుకమ్మ ఆడుతున్న మహిళలపై లక్షెట్టిపేట సీఐ లాఠీచార్జ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన మంతెన జగన్ మోహన్ రావు వర్గీయులు అర్ధరాత్రి రోడ్డెక్కి సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు.
లక్షెట్టిపేట సీఐ లాఠీచార్జ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంతెన జగన్ మోహన్ రావు వర్గీయులు సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అర్ధరాత్రి మంతెన జగన్ మోహన్ రావు తాళ్లపేటకు చేరుకుని ధర్నాలో పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు. మహిళలపై లాఠీచార్జ్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, మండలం తాళ్లపేటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గం, మంతెన జగన్ మోహన్ రావు వర్గం మధ్య రాజకీయ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.










