కాంగ్రెస్ పార్టీలో ఎనిమిదేళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్న రాష్ట్ర సేవల ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలకంఠ, ఢిల్లీలో రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన ఓట్ బచావో దేశ్ బచావో కార్యక్రమంలో ప్రత్యేక బృందాన్ని తరలించి పార్టీ పట్ల తన విధేయతను చాటుకున్నారు. గత ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు.
కాంగ్రెస్ పార్టీలో 8 ఏళ్లుగా అంకితభావంతో సేవలందిస్తూ, పార్టీ కార్యక్రమాల విజయానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ సేవల ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలకంఠ. తాజాగా ఢిల్లీలో రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన ఓట్ బచావో దేశ్ బచావో కార్యక్రమంలో ప్రత్యేక బృందాన్ని తరలించి తన పార్టీ విధేయతను చాటుకున్నారు.
గత ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ అవకాశం దక్కకపోయినా పార్టీకి దూరం కాకుండా సేవలు కొనసాగిస్తున్నారు. కాగజ్నగర్ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సూచనలు వచ్చినప్పటికీ సమయం తక్కువగా ఉండటంతో వెనక్కి తగ్గారు.
పదవులపై ఆశ కంటే కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర, కేంద్ర నాయకత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు.
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్న ఆకాంక్షతో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇలాంటి అంకితభావం కలిగిన నాయకులను కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించి సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












